UV Creations: ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఈ ముగ్గురిలో ‘మీసాలోడు’ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UV Creations: టాలీవుడ్ ప్రొడక్షన్స్ కంపెనీస్ లో యూవీ క్రియేషన్స్ ఒకటి.. పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరుగా వరుస సినిమాలను నిర్మిస్తూ యూవీ మంచి పేరును సంపాదించుకొంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తున్న యూవీ తాజాగా మీసాలోడు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. అయితే ఈ టైటిల్ ఎవరికి అనేది తెలియాల్సి ఉంది. ఈ టైటిల్ లీక్ అవ్వడంతో హీరో ఫ్యాన్స్ తమ హీరో కంటే తమ హీరోకే అని చర్చ మొదలుపెట్టాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ తో యూవీ ఒక సినిమా చేయబోతోంది. జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాను అందించిన గౌతమ్.. చరణ్ తో ఒక మాస్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ టైటిల్ కూడా చరణ్ కు బాగా సూటవుతుంది.. చరణ్ కోసం ఈ టైటిల్ ను అనుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం యూవీలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కి కూడా ఈ టైటిల్ సెట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక ఈ ఇద్దరు కాకుండా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు యూవీ చేతిలోనే ఉంటాయి. ప్రభాస్ కు కూడా మీసాలోడు సూట్ అవుతుందనే చెప్పొచ్చు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఆ టైటిల్ ను తన్నుకుపోయేది ఎవరో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ముగ్గురు కాకుండా నవీన్ పోలిశెట్టి ఏమైనా ఈ టైటిల్ పై మనసుపడ్డాడా..? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. యూవీ క్రియేషన్స్ లో నవీన్, అనుష్క జంటగా ఒక సినిమా వస్తున్న విషయం విదితమే.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కాకుండా మీసాలోడు ఏమైనా సెట్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..