యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు మంచి హోస్ట్ కూడా. ఇప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని బుల్లితెర షోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గతంలో ‘బిగ్ బాస్’, ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా కన్పించారు ఎన్టీఆర్. ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా కన్పించారు. వాటికి మంచి స్పందనే వచ్చింది. తాజాగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్‌తో కలిసి చేయబోతున్న భారీ యాక్షన్ డ్రామా “ఆర్సీ15”. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా “ఆర్సీ15” షూటింగ్ పూణేలో ప్రారంభమైంది. మేకర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో…
కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్‌లైన్ వైద్య…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) వెబ్‌సైట్‌ను లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్న చిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్…
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిభావంతులైన యువ స్వరకర్త శ్రవణ్ బరద్వాజ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా అదిరిపోయే శుభవార్త వచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కన్నడ పాపులర్ డైరెక్టర్ తో ఉండనుంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. పండగ రోజు ఈ ప్రకటన రావడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో పాటు ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషించాడు. అలానే స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే దసరా కానుకగా చెర్రీ అభిమానులకు మాత్రం డబుల్ థమాకా లభించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్త అధికారికంగా వచ్చింది. అలానే…
ఆర్ఆర్ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన రామ్ చరణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీరావా, జర్సీ వంటి హిట్ చిత్రాలకు గౌతమ్…
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు…