‘ఆచార్య’కు దండం పెట్టిన కొరటాల శివ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు సంవత్సరాలు ఒకే సినిమాతో ప్రయాణం సాగించాలంటే కష్టమైన పనే. అదీ వరుస హిట్స్ ఇస్తూ ఊపుమీద ఉన్న దర్శకుడికి మరింత కష్టం. కానీ కొరటాలకు తప్పలేదు. 2018లో ‘భరత్ అను నేను’ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా కమిట్ అయి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నప్పటికీ వీలయినంత ఫాస్ట్ గా పూర్తి చేశాడు. అయినా కరోనా కారణంగా రిలీజ్ లేట్ అయి ఫిబ్రవరి 2022 లో రాబోతోంది ఈ చిత్రం. నిజానికి కొరటాల శివ ‘ఆచార్య’కు సంబంధించి తన పని మొత్తం పూర్తి చేసి ఫైనల్ కాపీ కూడా సిద్ధం చేశాడు. అయితే ‘ఆచార్య’ విడుదల వాయిదా పడటంతో కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. శ్రీధర్ సీపానతో పాటు మరి కొందరు రచయితలతో కలసి స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నాడు. ఈ సినిమా షూట్ ను డిసెంబర్ లో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ అందుబాటులో లేనందువల్ల జనవరిలో ఇతర తారాగణంతో కొన్ని సీన్స్ తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజ్ తో పాటు ప్రమోషన్ కోసం గ్యాప్ తీసుకుని, విడుదల కాగానే మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేసి ఆ సినిమాను వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలన్నది ప్లాన్. సో వచ్చే ఏడాది రెండు సినిమాలతో రాబోతున్న కొరటాల తన సక్సెస్ ట్రాక్ ను అలాగే కొనసాగిస్తాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!