దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు.
బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !
ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం స్థానిక ప్రాంతాలను లేదా నగరాలను ఎంచుకునే వారు. కానీ ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ తో పాటు సౌత్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మేకర్స్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను అలరించడానికి కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి వెనకాడట్లేదు. నిర్మాతలు బడ్జెట్ గురించి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సౌత్ చిత్రపరిశ్రమకు గతంలో ఉన్న పరిధులు అన్నీ తొలగిపోయాయి. సినిమా కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తుంటే మరి ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆలోచిస్తారా? ‘తగ్గేదే లే’ అంటూ ప్రమోషన్ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. మరి ఇంతలా ఖర్చు పెట్టి మామూలుగా ప్రమోషన్ చేస్తే ఏం బాగుంటుంది? అందుకే అంతర్జాతీయంగా ఉన్న సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి దక్షిణ భారత సినిమా ప్రమోషన్లకు దుబాయ్ ని కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇంతకుముందు హిందీ సినిమాలు మాత్రమే ప్రమోషన్ల కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకునేవి. సౌత్ నుంచి ముందుగా ‘రోబో’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం దుబాయ్‌లో జరిగింది.
Read Also : పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ… ఫస్ట్ ఎఫెక్ట్ బాలయ్యపైనే !
దుబాయ్ అడ్డాగా టాలీవుడ్ ఈవెంట్స్
ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ నేరుగా దుబాయ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన “కురుప్” ట్రైలర్‌ను బుర్జ్ దుబాయ్‌లో ప్రదర్శించి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. టాలీవుడ్ ఉంచి రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఈవెంట్ దుబాయ్‌లో జరగనుంది. “పుష్ప” కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతోంది. ప్రస్తుతం బన్నీ తెలుగు సినిమా దాటి తన పరిధిని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఆయనకు అన్ని భారతీయా ప్రధాన భాషల్లోనూ సొంత పిఆర్ టీమ్ ఉంది. ఇప్పుడు దుబాయ్‌లో “పుష్ప” ఈవెంట్ నిర్వహించబోతున్నారు.