Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు పరిష్కారం కావడం లేదు. ఇరువురితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఓ కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకుంది.. తన కడుపున పుట్టిన నలుగురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. బార్మర్ జిల్లాలోని మాండ్లీ స్టేషన్ ప్రాంతం లో జెతారామ్ తన భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే.. శనివారం జేతారామ్ కూలి నిమిత్తం బాలేసర్ కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయం లో ఊర్మిళ తన పిల్లలు భావన, విక్రమ్, విమల, మనీషా లను వడ్లు…
రాజస్థాన్‌లో ఈసారి మే నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 100 ఏళ్లలో ఇదే నెలలో అత్యధికం అని భారత వాతావరణ శాఖ నిన్న ( గురువారం ) తెలిపింది. రాష్ట్రంలో సాధారణంగా మే నెలలో సగటున 13.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు.
Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్‌లో వెలుగు చూసింది.
Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
Jaipur : రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని చంపి యువకుడు మాంసాన్ని తిన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు రూ.4.50 లక్షలకు ఆ చిన్నారి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ…