భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్. ఇతని భార్యకు ఇతనికి ఈమధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి గొడవల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు…
అయితే, ఏదోక కారణం చేత గొడవలు పడేవారు.. అయితే తాజాగా ఒక గొడవ జరిగింది.. తమ గొడవలో కోపంతో రెచ్చిపోయి ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. తరువాత ఉక్రోశం తో తమ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.. ఇద్దరి బంధువులు కలిసి వచ్చారు.. తీవ్రంగా కొట్టుకున్నారు.. ఈ క్రమంలో అడ్డు వచ్చిన బంధువుల కు తీవ్రంగా దెబ్బలు తగిలాయి.. భార్యాభర్తల మధ్య గొడవ ఆపి వారిని శాంత పరచాల్సిందిపోయి అక్కడికి వచ్చిన వారు కూడా గొడవలో తలదూర్చారు. వారంతా రెచ్చిపోయి రాళ్లు రువ్వుకుని, కర్రల తో దాడి చేసుకున్నారు… ఈ ఘటన లో 17 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి..
రాత్రి సమయంలో ఉన్నట్టుండి అరుపుల తో గొడవ మొదలైందని, కొద్దిసేపటిలోనే అక్కడ వాతావరణం చాలా గందరగోళంగా మారిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. గాయపడిన వారిని ప్రైవేట్ వాహనాలలోనూ, అంబులెన్స్ లలోనూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.. గొడవకు కారణం ఏంటని పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. మొత్తానికి ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..