బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల లీలా ప్యాలెస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ను ప్రకటించాడన్నారు.
Women Was Gang Raped by 6 Men in Rajasthan: రాజస్థాన్లోని దారుణం చోటుచేసుకుంది. పహాడీ సబ్ డివిజన్ పరిధిలో ఓ వితంతువుకు మత్తుమందు ఇచ్చి.. కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఆరుగురు కామాంధులు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పహాడీ సబ్ డివిజన్ పరిధిలో భర్తను కోల్పోయి ఇద్దరు…
Rajasthan Assembly Election: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ చట్టం లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందితే.. పలు రాష్ట్రాల అసెంబ్లీల చిత్రణ పూర్తిగా మారిపోతుంది.
రాజస్థాన్లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.
Kota: మెదడుకు ఎక్కని చదువులు, తీవ్ర ఒత్తిడి, ఎక్కడ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేమో అనే భయం ఇలా నీట్ విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా రెండు పదులు నిండని వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
State Elections: ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఉన్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు.
Shanti Dhariwal: ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి, ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేసు విషయంలోనూ…