ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ ప్రాంతంలో రైళ్లు చాలా రద్దీగా వేగంగా ప్రయాణీస్తూ ఉంటాయి.
Also Read: ISKCON Biggest Cheat: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రయాణీకులతో పూర్తిగా నిండిపోయిన ఒక ట్రైన్ కొండల మధ్య నుంచి వస్తుంది. దానిని దూరం నుంచి కొంతమంది వీడియో తీస్తున్నారు. ఆ ట్రైన్ ఎంత ఫుల్ గా ఉంది అంటే దాని పైన, ఫుట్ బోర్డు మీద కూడా జనాలు కూర్చోని ఉన్నారు. ఆ బ్రిడ్జి చాలా ఇరుక్కుగా ఉంది. అక్కడ ట్రైన్ వస్తుంటే పక్కకు వెళ్లడానికి చోటు కూడా లేదు. అయితే ఆ యువకులు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా దానిని దూరం నుంచి వీడియో తీస్తూ అక్కడే ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి మాత్రం ట్రైన్ రావడానికి ముందే అక్కడి నుంచి తప్పుకున్నాడు. మరో వ్యక్తికి ట్రైన్ తగిలి కింద పడిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో మాత్రం తెలియలేదు. ఎందుకంటే ఆ వీడియో అక్కడితో కట్ అయిపోయింది. అయితే ట్రైన్ లో ఉన్న వారు మాత్రం అతడిని చూసి ఆశ్చర్యపోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకులకు కొంచెం కూడా బుద్ది లేదు అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడటం అంటే ఇదే అంటున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.6 లక్షల మందికి పైగా వీక్షించారు.