ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Rajasthan Voter List: రాజస్థాన్‌లో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది.
రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఆమె డిప్రెషన్‌తో బాధపడేదని తెలిసింది.
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. గెహ్లాట్ తన వ్రాతపూర్వక సమర్పణలో, తన వ్యాఖ్యలు తన ఆలోచనలు కాదని, బాధ కలిగించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
Vande Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను తీసుకువచ్చింది. ఇప్పటికే 60 పైగా వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి. రానున్న కాలంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ట్రాక్ ఎక్కనున్నాయి. ఇదిలా ఉంటే కొందరు మాత్రం ఈ రైళ్లు టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా నమోదయ్యాయి.
PM Modi: కాంగ్రెస్ పార్టీ, అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో దారుణంగా మతోన్మాదులు చేతిలో హత్యకు గురైన కన్హయ్య లాల్ అంశాన్ని మోడీ ప్రస్తావించారు.
Communal Tension: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో మత ఉద్రిక్తతలు ఏర్పడింది. రామ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మోటార్ సైకిళ్ల యాక్సిడెంట్ తరువాత ఒక గుంపు తీవ్రంగా కొట్టడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన శనివారం నగరంలో ఉద్రిక్తతను పెంచింది. అయితే అవగాహన లోపంతో ఇది జరిగిందని సిటీ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు.…