‘శేఖర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ.. ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకూ శివాని స్విగ్గీ వాళ్ళని వదిలిపెట్టదని, ఆ అమ్మాయి కోమటిదాని లెక్క’ అంటూ జీవిత వ్యాఖ్యానించారు. ఇవి ఆర్యవైశ్యుల్ని కించపరిచేలా ఉండడంతో.. ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్…
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నూతన దర్శకుడు లలిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలోకి రానుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది మ్యాన్ విత్ ది స్కార్’ అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే సినిమా విడుదల…
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్…
(ఫిబ్రవరి 4న డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు)డాక్టర్ రాజశేఖర్ తెరపై కనిపించగానే, ఆయన అభిమానుల ఆనందం అంబరమంటేది. యాంగ్రీ మేన్ గా ఈ నాటికీ ఆయన అలరిస్తున్న తీరు మరపురానిది. ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు రాజశేఖర్. ఆ ఉత్సాహమే ఆయన అభిమానులనకు ఆనందం పంచుతోంది. ఓ వైపు తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లు గా నటిస్తున్న సమయంలో రాజశేఖర్ ఇప్పటకీ హీరో వేషాలతో అలరించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం! రాజశేఖర్…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా…
దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవర్తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే…
(సెప్టెంబర్ 2న జీవిత రాజశేఖర్ పుట్టినరోజు)“కార్యేషు దాసి… కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తన భర్త డాక్టర్ రాజశేఖర్ ను హీరోగా నిలపడంలోనూ, స్టార్ హీరోని చేయడంలోనూ, అతని విజయానికి వెన్నెముకగా నిలచి జీవిత సాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో అలా సాగిన వారిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. తరువాత జీవిత, రాజశేఖర్…
సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికంగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. చాలాకాలంగా రాజశేఖర్ చేతిలో సినిమాలు లేవు. “గరుడ వేగ”తో రీఎంట్రీ ఇచ్చిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అనంతరం “కల్కి”తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ఇటీవలే “శేఖర్” అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న…