బిగ్ బాస్ షో లో విజేతగా నిలవాలంటే… ఆడియెన్స్ నుండి కూడా కంటెస్టెంట్స్ కు ఓట్ల రూపంలో సపోర్ట్ దక్కాలి. ఇందులో నిజం ఎంత, ఆ ఓట్లను ఏ మేరకు కన్సిడర్ చేస్తారు అనే దానిని పక్కన పెడితే, బిగ్ బాస్ షోకి సంబంధించి ఆడియెన్స్ కు చూపించే కంటెంట్ మీద ఆధారపడే వ్యూవర్ ఓటు వేస్తాడు. ఇక అభిమానులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లయెన్సర్స్ ద్వారా పడే ఓట్లది వేరే లెక్క. ఈ రకంగా చూసినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 20 మంది కంటెస్టెంట్స్ లో ఎవరి ఫుటేజ్ ఎక్కువ చూపిస్తే… వారి మీదనే వ్యూవర్స్ ఓ అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకోగలరు. బట్ కొంతమంది ఫుటేజ్ అసలు వ్యూవర్స్ ముందుకే రావడం లేదు. ఉదాహరణకు రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం చేస్తున్నాడు? అతని పొటన్షియాలిటీ ఏమిటీ అనేది ఇంతవరకూ బయటపడలేదు. అలానే షానీ, ఆదిరెడ్డికి సంబంధించిన ఫుటేజ్ ను కూడా చాలా తక్కువ చూపిస్తున్నారు. దీంతో వీళ్ళను జడ్జిచేసే అవకాశం వ్యూవర్స్ కు చాలా తక్కువ ఉంటుంది. ఈ ముగ్గురూ కూడా ఈవారం ఎలిమినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన ఫుటేజ్ చూపకుండా, నామినేట్ అయిన మిగిలిన వారికి సంబంధించిన ఫుటేజ్ కు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు సహజంగా ఎక్కువ ఓట్లు వాళ్ళకే పడే ఛాన్స్ ఉంటుంది. సింగర్ రేవంత్, ఫైమా, అభినయశ్రీ వంటి వాళ్ళు ఇప్పటికే కొద్దో గొప్పో జనాలలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే. సో… వారికి బదులుగా రాజశేఖర్, శ్రీహాన్, ఆదిరెడ్డి లాంటి వాళ్ళకు సంబంధించిన ఫుటేజ్ ను ప్లే చేస్తే జనాలు ఓ జడ్జిమెంట్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ ఆల్ గా కంటెస్టెంట్స్ కు ఓట్లు పడే విషయంలో బిగ్ బాస్ కూడా గేమ్ ప్లే చేస్తున్నాడనే అనిపిస్తోంది.

ఇక మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ను బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులకు కేటాయించాడు. పిల్లల బొమ్మలను కంటెస్టెంట్స్ కు అందచేసి వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని, గేమ్ అయ్యే వరకూ తమ వద్దే ఉంచుకోవాలని సూచన చేస్తూ, మధ్యలో కొన్ని టాస్క్ లు పెట్టాడు. ఫస్ట్ టాస్క్ లో గీతు, ఆరోహి, చలాకీ చంటి, ఫైమా, రేవంత్ విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత శాక్స్ అండ్ షేప్స్ గేమ్ లో చలాకీ చంటి విజేత అయ్యాడు. ఆ ఆటలో తనకు అన్యాయం జరిగిందని భావించిన రేవంత్ అలిగి, బొమ్మను కోల్పోయాడు. మూడో గేమ్ లో అర్జున్ కళ్యాణ్, ఇనయా, ఆరోహి, కీర్తి, ఫైమా గెలుపొందారు. ఆ తర్వాత కాస్తంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభినయశ్రీ, శ్రీసత్య కూడా బొమ్మలను వదులు కోవాల్సి వచ్చింది. ఈ ఆట మర్నాడు కూడా కొనసాగుతుందని, అప్పటి వరకూ బొమ్మలను ఎవరికి వారు జాగ్రత్తగా దాచుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. సో… అసలు కన్నింగ్ గేమ్ ఈ నైట్ జరుగబోతోంది. ఎలాగైనా రెండు బొమ్మలను కొట్టేయాలనే తీవ్ర నిర్ణయాన్ని గీతూ రాయల్ తీసుకుంది. మరి ఆమె పన్నాగం ఫలిస్తుందో లేదో చూడాలి. అలానే తాను ఓడిపోవడానికి కారణమైన ఫైమా కాకుండా చలాకీ చంటీ ఈవారం కెప్టెన్ కావాలని రేవంత్ కోరుకుంటున్నాడు. మరి అతని కోరిక ఏ మేరకు నెరవేరుతుందో రేపటికి గానీ తెలియదు.