యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నూతన దర్శకుడు లలిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలోకి రానుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది మ్యాన్ విత్ ది స్కార్’ అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ మరోమారు ‘శేఖర్’ మూవీ రిలీజ్ ను కన్ఫర్మ్ చేశారు.
Read Also : Raveena Tandon : వాంతులు చేసుకుంటే క్లీనింగ్… హీరోయిన్ ఎలా అయ్యిందంటే?
ప్రస్తుతం జీవిత రాజశేఖర్ 26 కోట్లు ఎగవేసిందంటూ కోటేశ్వర రాజు అనే నిర్మాత తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో జీవిత ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగింది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. అంతేకాదు కోర్టు తీర్పు వచ్చాక మాట్లాడతానని వెల్లడించింది. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో ‘శేఖర్’ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ మరోసారి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీం సినిమా ఖచ్చితంగా అనుకున్న సమయానికే వస్తుందని ప్రకటించారు.