Traffic Police Special Drive: శబ్ద కాలుష్య నివారణపై ఫోకస్.. బైక్ సైలెన్సర్ల తనిఖీ.. పోలీసుల స్పెషల్ డ్రైవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Police Special Drive: అధిక శబ్దంతో కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.. అయితే, అధిక శబ్దంతో నడిచే వాహనాలపై చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.
Read Also: Oil Tanker Overturned: జగిత్యాలలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ట్రాన్స్ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం..
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
కాగా, అధిక ధ్వనిని వినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి రక్తపోటు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటికి నివారణకు చర్యలు తీసుకుంటున్నా.. కొందరు పెద్ద సౌండ్‌తో కూడాన హారన్లను వాడడం.. మరికొందరు బుల్లెట్ మోటార్ సైకిళ్లకు సైలెన్సర్‌లను తొలగించి ఇష్టానుసారం భారీ శబ్దం వచ్చేలా వాహనాలను నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలకు పూనుకుంటూనే ఉన్నారు.. కానీ, పోలీసులకు చిక్కకుండా కొందరు తప్పించుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు.. కాగా, గతంలో స్పెషల్ డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డుపై పెట్టి.. రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!