Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 3న రాజమండ్రి నగరంలో ప్రియాంక తన స్కూటీపై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంక కిందపడిపోగా, రాక్షసత్వంతో వ్యవహరించిన ఆ మందుబాబులు కారును ఆపకుండా ఆమె తలపై నుంచి తీసుకెళ్లారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఆమెను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం ఆమెను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. వెంటిలేటర్‌పై ఉంచి అత్యంత ఆధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ, ఆమె పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె మెదడు పనిచేయడం లేదని (బ్రెయిన్ డెడ్) వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
వైద్యురాలై సమాజానికి సేవ చేయాలని ఎన్నో ఆశలతో చదువుకుంటున్న కూతురు, మందుబాబుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడంతో ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజమండ్రిలోనూ, ఆమె చదువుకుంటున్న కళాశాలలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన కారును, మద్యం మత్తులో కారు నడిపిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!