APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
- ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- మానసిక వేధింపులే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Suicide Case: రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో గోదావరి నదిలో వంశీ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన చంద్రమల్ల వంశీగా గుర్తించారు. ఆయన కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలవులో ఉన్న సమయంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఓ మహిళా కానిస్టేబుల్ వేధింపుల కారణంగా వంశీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వంశీ తండ్రి ఆరోపించారు. అలాగే వంశీకి మరో యువతితో త్వరలో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఈ ఘటన జరగడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. తన కుమారుడు మానసిక వేధనల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని వంశీ తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఘటనకు గల అసలు కారణాలపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ఈ ఘటనపై రాజమండ్రి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వంశీ కాల్ డేటా, మెసేజెస్, వాట్సఫ్ చెక్ చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!