Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో నదీ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోతుండటంతో గోదావరి గట్టు ప్రమాదంలో పడింది. దీంతో చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి, మరింత నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. నదీ తీరంలో కోతను అరికట్టేందుకు భారీగా ఇసుక బస్తాలను వేస్తూ రక్షణ గోడగా ఏర్పాటు చేస్తున్నారు.
Also Read
ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెప్తున్నారు. ప్రవాహ ఉధృతి పెరిగినా తట్టుకునేలా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నామని, నీటిమట్టం మరో ఐదు అడుగులు పెరిగినా ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం తీర ప్రాంతంలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!