ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేరు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30శాతం ఓటింగ్ నమోదైంది. లంచ్ టైం కావడంతో పోలింగ్ తగ్గింది. క్యూలలో మహిళా ఓటర్లే కీలకంగా మారింది.
మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదని, వారి నెత్తిమీద రూపాయ పెట్టినా అర్ధ రూపాయకి కూడా ఎవరు కొనరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని, ఆయనైనా తానైనా ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు.