Bandi Sanjay Kumar: ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. మునుగోడు సహా రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఇచ్చిన హామీలను ఎద్దేవా చేస్తూ పోస్టర్లు రూపొందించింది బీజేపీ. సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ బండి సంజయ్ పోస్టర్లు విడుదల చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం వినూత్నంగా రూపొందించిన ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ విడుదల చేశారు.
(7/n)@krg_reddy pic.twitter.com/3ReUbrNY6W
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
— BJP Telangana (@BJP4Telangana) October 29, 2022
మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, కంకణాల నివేదితా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏండ్ల పాలనలోని ప్రజావ్యతిరేక విధానాలను, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఎండగడుతూ సోషల్‌మీడియా విభాగం వినూత్నంగా, ప్రజలను ఆకర్షించేవిధంగా పోస్టర్లను రూపొందించడాన్ని ఆయన అభినందించారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రూపొందించిన ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను సోషల్ మీడియా అన్నీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.
* చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ఆకుపచ్చ మునుగోడును చేస్తా కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు ఉచిత ఎరువులు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ఇంటికో ఉద్యోగంకేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* నిరుద్యోగభృతి కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ఫీజు రీఇంబర్స్‌మెంట్ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ఎంబీసీలకు ప్రతీ బడ్జెట్‌లో వెయ్యికోట్లు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనులు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* కొత్త ఆసరా ఫించన్లు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ఉద్యమకారులకు రాజకీయ అవకాశాలు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ కేసీఆర్ – ఆ-ఒక్కటీ అడక్కు
* రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
*గ్రామపంచాయతీకి 20 లక్షలు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* పంటకు కనీస మద్దతు ధర కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* మూసీ ప్రక్షాళన కేసీఆర్- ఆ ఒక్కటీ అడక్కు
* జిల్లా కేంద్రాల్లో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
* రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కేసీఆర్ – ఆ ఒక్కటీ అడక్కు
తాజావార్తలు
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!