మునుగోడులో 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేఏ పాల్.. ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి 500 ఓట్లు కూడా రాలేదు.
బీజేపీపై టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాకులు చెవాకులు మాట్లాడుతోందిని రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని మేము అడుగుతున్నామన్నారు.
మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
అనుకున్న మెజార్టీ రావడం లేదంటూ మునుగోడు బరిలో వున్న అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అసహనం వ్యక్తం చేస్తూ కౌంటర్ సెంటర్ నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది.
నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు.
ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేరు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30శాతం ఓటింగ్ నమోదైంది. లంచ్ టైం కావడంతో పోలింగ్ తగ్గింది. క్యూలలో మహిళా ఓటర్లే కీలకంగా మారింది.