Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
Off The Record: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అత్యంత కీలకమైన బిల్లులను ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై కొత్త కొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభుత్వం చట్ట సభల్లో ఐదు బిల్లుల్ని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధనను ఎత్తేస్తూ…. రిజర్వేషన్స్ పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పేసింది సభ. ఇక అల్లొపతిక్…
మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఈ రోజున జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు ముర్ము ఉత్తరాఖండ్‌లో తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. రాజ్‌పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్‌లో ఆమె తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆధునిక…
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…
మహారాష్ట్ర కేబినెట్‌లో మంగళవారం ఒక కీలక పరిణామం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఎన్‌సీపీకి చెందిన 77 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుడు ఛగన్ భుజ్‌బాల్ చేరనున్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, గవర్నర్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కునాల్ ఘోష్, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం నోటీసు పంపారు.
New Governors: ఈరోజు (జనవరి 2) బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికైన గవర్నర్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇవాళ బీహార్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు.
Tamil Nadu: ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిను తమిళక వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కలవనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక, రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. డిన్నర్ చేస్తూ రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్, మాజీ రాష్ట్రపతిలతో చర్చించారు సీఎం చంద్రబాబు..