రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఇదే రోజున జన్మించారు. ముర్ము పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షురాలు ముర్ము ఉత్తరాఖండ్‌లోని రాజ్‌పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్‌లో తన పుట్టినరోజును జరుపుకుంటారు.ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. తన బర్త్‌డే సందర్భంగా ఆధునిక పబ్లిక్ పార్కుకు పునాది వేయనున్నారు. ఈ పార్క్‌ను 132 ఎకరాల్లో నిర్మిస్తున్నారు.
READ MORE: DCCB Director Kidnap: నిర్మల్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్.. ఆరుగురు అరెస్ట్
వాస్తవానికి.. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ ఆసీన్నులయ్యారు. ముర్ము ప్రారంభ జీవితం కష్టాలు, పోరాటాలతో నిండిపోయింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె చివరకు దేశ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదపోసిలో 1958 జూన్ 20న జన్మించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా (1973-1983 మధ్యకాలంలో).. రాయ్‌రంగపూర్‌లో శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఉపాధ్యాయురాలిగా (1994-1997) పనిచేశారు. భారత రాష్ట్రపతులందరిలో అతి పిన్న వయస్కురాలు (64 ఏళ్లు) ఈమే కావడం విశేషం.
READ MORE: India vs England: సాయి సుదర్శన్ అరంగ్రేటం.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!
గతంలో ఈ రికార్డు నీలం సంజీవ రెడ్డి (67 ఏళ్లు) పేరిట ఉండగా.. అనంతరం 64 ఏళ్ల ముర్ము దక్కించుకున్నారు. 1997లో బీజేపీలో చేరిన ఆమె రాయ్‌రంగపుర్ కౌన్సిలర్‌గా, వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2000-2002 మధ్య ఒడిశా రవాణా, వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. 2002 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, పనిచేశారు. 2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2022లో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెను ఎన్డీయే బరిలో దించింది. ఆమె విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం సాధించారు.