కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ బలహీనపడుతోంది. మచిలీపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా నుంచి బలహీనపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరికొద్ది గంటల తర్వాత ఇదే ప్రాంతంలో తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Breaking: తీరం దాటిన అసని తుఫాన్ వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 45-…
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో…
అసని తుఫాన్ ఏపీ వైపునకు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 670కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి తీవ్ర తుఫాన్ ప్రవేశించనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ దిశను మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి ప్రయాణిస్తుందని భావిస్తోంది. సని తుఫాన్ ఒడిశా వైపు వెళ్లినా.. ఏపీ తీరంపైనా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. శ్రీకాకుళం,…
గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసని తుఫాన్ వల్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో సబ్‌స్టేషన్‌లో మంటలు భారీగా చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తాడికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు…
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
మండు వేసవిలో ఏపీకి తుఫాన్ అలర్ట్ పొంచి ఉంది. ఏపీలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు అకాల వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 8 నాటికి ఈ వాయుగుండం తుఫాన్‌గా రూపు సంతరించుకుంటుందని… ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య ఈ…
ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు…
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది… అయితే, కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి అయ్యారు.. ఆదోని మండలం కుప్పగల్‌లో పిడుగు పడి కనిగిని ఉరుకుంధమ్మ (33), కనిగిని లక్ష్మమ్మ (39) ఇద్దరు మహిళలు మృతిచెందారు.. ఇక, హోళగొంద మండలం వండవాగిలిలో పంట పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు తాయన్న, చంద్రన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.. అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ వాసులకు చల్లని కబురుతో వర్షాలు కురుస్తున్నామ..…
ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే…