తెలంగాణ వాతావారణ శాఖ హెచ్చిరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, సిద్ధిపేట, శామీర్ పేటతో పాటు యాదాద్రి, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో పిడుగులతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. Read Also: బీజేపీ చరిత్ర మార్చే…
ఆఫ్రికా దేశం కెన్యాలో ప్రస్తుతం కరువు తాండవిస్తోంది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో వన్యప్రాణులకు ఆహరం, నీరు దొరక్క మృత్యువాత పడుతున్నాయి. కెన్యా సఫారీలోని ఓ ప్రాంతంలో ఆరు జిరాఫీలు ఆహారం, నీరు దొరక్క మృత్యువాత పట్టాయి. ఆ దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. డ్రోన్ నుంచి తీసిన ఫొటోలు చూస్తే చేత్తో వేసిన ఆర్ట్స్ మాదిరిగా ఉన్నది. అయితే, అదే ఫొటోలను దగ్గరగా చూస్తే ఒళ్లు జలదరించకమానదు. Read: వేతనాలు,పెన్షన్లపై…
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో…
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో…
తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తం అయింది విశాఖ పోలీసు శాఖ. నగర ప్రజలు,వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు సిటీ పోలీసులు. రేపటి నుంచి ఆదివారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగిపడ్డం, రహదారులు జలమయం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రవాణాకు అడ్డంకులు ఏర్పడతాయి కనుక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప తుఫాన్ సమయంలో రోడ్లపైకి రావద్దని కోరింది. రాబోయే తుఫాన్ కి సంబంధించి విశాఖ…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అల్పపీడనం అండమాన్ దీవుల వరకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం పశ్చి వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి డిసెంబర్ 2 వ తేదీ వరకు వాయుగుండంగా మారి డిసెంబర్ 3 వ తేదీ వరకు బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 4 వ తేదీన ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరమునకు చేరవచ్చని వాతావరణ శాఖ…
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్ర…