Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు…
కడప: నేడు మూడో రోజు టీడీపీ మహానాడు. ఐదు లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి కడప నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు సీఐఐ వార్షిక సమావేశానికి హాజరుకానున్న సీఎం. రేపు రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస. నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. ఖర్గేను కలవనున్న మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు. కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్న ఎమ్మెల్యేలు. హైదరాబాద్: నేడు బాచుపల్లిలో…
Rain Alert: నైరుతి ఋతుపవనాలు బుధవారం ( మే 28) నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది.
దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. కొద్ది సేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.…
Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో…
సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్లో 10 మంది ఉగ్రవాదులు హతం.. మణిపూర్లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు…