దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Covid Cases: భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా.. కేరళ, ముంబై, ఢిల్లీలో పెరిగిన కేసులు
ఆది, సోమవారాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని.. ఉరుములు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో గంటకు 76 కి.మీ వేగంతో గాలులు వీచడంతో పాటు బలమైన దుమ్ము తుఫాను వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Prashanth Varma : ప్రశాంత్ వర్మ ను ఏకిపారేస్తున్న మూవీ లవర్స్
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. శనివారం మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి.
16 ఏళ్ల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ తెలిపింది. 2009లో మే 23న రుతుపవనాలు ప్రవేశించాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు వచ్చాయి. సాధారణ తేదీ కంటే 8 రోజులు ముందే రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ పేర్కొంది.
వాస్తవంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు తలెత్తలేదు. ఇక రోహిణి కార్తె మే 25న(ఆదివారం) రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రాహిణి కార్తె సమయంలో ఎండలు భగభగ మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాళ్లు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారిగా 1918 మే 11న రుతుపవనాలు ప్రవేశించిన రికార్డ్ ఉంది. అలాగే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చిన రికార్డు ఉంది. 1972లో జూన్ 18న రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాల్లో అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు 2016లో వచ్చాయి. జూన్ 9న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి.
ఇదిలా ఉంటే రుతుపవనాల రాకతో మే 29 వరకు కేరళ, తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.