నేటి నుంచి 4 రోజుల తెలంగాణలో వర్షాలు. పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో నేటి నుంచి మరో 25 చోట్ల స్లాట్ విధానం. భారీగా రిజిస్ట్రేషన్లు ఉన్న 3 చోట్ల అదనపు సిబ్బంది. స్లాట్ విధానంలో రోజుకు 45…
ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.. వైరల్ అవుతున్న వీడియో.. హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన 4…
ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్…
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
Orange Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోందా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం పడుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తోంది. కాగా, హైదరాబాద్ పరిధిలో బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో కురుస్తుంది వర్షం.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. దాదాప 3-4 గంటల్లో ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను త్వరలో బలహీనపడి నవంబర్ 30 నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.