Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షం కూడా సంభవించనుందని పేర్కొంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
P.G. Vinda: మరోసారి తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి. విందా
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:
నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ఎల్లో అలర్ట్ కలిగిన జిల్లాలు:
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఈ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. అయితే ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Nara Lokesh: అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన.. రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!