కడప: నేడు మూడో రోజు టీడీపీ మహానాడు. ఐదు లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ.
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి కడప నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు సీఐఐ వార్షిక సమావేశానికి హాజరుకానున్న సీఎం. రేపు రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస.
నేడు ఢిల్లీకి టి.కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. ఖర్గేను కలవనున్న మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు. కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్న ఎమ్మెల్యేలు.
హైదరాబాద్: నేడు బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ. భద్రతా దళాలకు సంఘీభావంగా కొనసాగనున్న ర్యాలీ. ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు వాయుగుండంగా మారే అవకాశం. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు. గంటలకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్: నేడు దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 65,213 మంది అభ్యర్థులు.
నేడు జమ్ము కశ్మీర్‌లో హోంమంత్రి అమిత్ షా పర్యటన. ఎల్జీ, ఆర్మీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష. అమర్‌నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై చర్చ.
మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. నేడు తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.
IPL: నేడు పంజాబ్-బెంగళూరు తొలి క్వాలిఫయర్ మ్యాచ్. ముల్లాన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
విజయవాడ: నేడు ఉదయం 9గంటలకు కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్‌కు జగన్. నిర్మలా శిశుభవన్‌లో ఆనాద పిల్లలతో కాసేపు గడపనున్న జగన్.
విజయవాడ: ఇవాళ రాజ్ కేసిరెడ్డిని విచారించనున్న ఈడీ. నిన్న లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం. సుమారు 100కి పైగా ప్రశ్నలను రాజ్ కేసిరెడ్డిని అడిగిన ఈడీ అధికారులు. సిట్‌కు రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సమాధానాలను తమకి ఇచ్చిన సమాధానాలను సరిపోల్చుకున్న ఈడీ. అనేక ప్రశ్నలకు వేర్వేరు సమాధానాలు రాజ్ కేసిరెడ్డి ఇచ్చినట్టు ఈడీ గుర్తింపు.
విజయవాడ: వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు. నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీని 2 రోజుల కస్టడీ కోరిన పోలీసులు. కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు ఇవ్వనున్న నూజివీడు కోర్టు.
గుంటూరు: ఇవాళ రెండోరోజు నందిగం సురేష్ విచారణ. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి.
HYD: నేడు, రేపు ఆయా జిల్లాల్లో మంత్రుల పర్యటన. ఇందిరమ్మ ఇళ్లపై రెండు రోజులపాటు సమీక్షించనున్న మంత్రులు.