ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో వరుస తుపానుల కారణంగా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నదులు, వాంగులు పొంగి పోయాయి, దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాల కారణంగా కొన్ని ప్రాణాలు పోయాయి, రైతులు పంటలు నష్టపోయారు. ఇప్పుడే ఆ నష్టాల నుంచి తేరుకోకముందే, మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.