Rain Alert: నైరుతి ఋతుపవనాలు బుధవారం ( మే 28) నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై వరద ప్రభావిత జిల్లాల అధికారా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read Also: Operation Sindhoor: దేశభక్తిని చాటేలా ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్
కాగా, హోం & విపత్తు నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల ప్రకారం నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో మునిగిపోయే ప్రాంతల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంచాలని వెల్లడించింది. ఇక, రేపు (మే 29) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read Also: Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
అలాగే, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అయితే, శుక్రవారం (మే30) నాడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది.