Indian Railways: భారతీయ రైల్వే ఆదాయానికి సంబంధించి ఒక పెద్ద వార్త బహిర్గతం అయింది. ఇటీవల ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో పిల్లల టిక్కెట్లను విక్రయించడం ద్వారా భారతీయ రైల్వే రూ.2800 కోట్లు ఆర్జించింది.
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.
IRCTC: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో వేగంగా నడుస్తున్న రైళ్లలో ప్రయాణించడానికి లక్షలాది మంది ప్రజలు IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.
రైళ్లలో ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. వందే భారత్‌తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్, అనుభూతి, విస్టాడోమ్ కోచ్ ఛార్జీలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Vande Bharat trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ఇప్పటికే పలు రూట్లలో ప్రవేశపెట్టారు. సెమీ హైస్పీడ్ రైలుగా ప్రసిద్ధి చెందిన వందేభారత్ రైళ్లు తక్కువ సమయంలోనే ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇదిలా ఉంటే వందేభారత్ ట్రైన్ ఛార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఛార్జీలపై రైల్వే శాఖ సమీక్షిస్తుంది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న మార్గాల్లో మాత్రమే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
Supreame Court: రైలు ప్రయాణంలో దొంగతనం చేయడం రైల్వేకు సంబంధం లేదని, ఇది రైల్వే శాఖ సేవల్లో లోపం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్ బాధ్యత వహించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక వ్యాపారవేత్తకు రూ. 1 లక్ష చెల్లించాలని రైల్వేని ఆదేశించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఉత్తర్వును పక్కన పెడుతూ న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం…
బిపర్‌జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే నేడు (మంగళవారం) 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొనింది.
Ashwini Vaishnav: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విరుచుకుపడ్డారు. 2024కి ముందు రఘురామ్ రాజన్ ఎలా ఉండేవారో, 2014 తర్వాత ఏమయ్యారో చెప్పారు.
రైల్వే తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం సంచిత రిజర్వేషన్‌ను అందిస్తోంది. వారికి వయస్సు సడలింపు, ఫిట్నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని రైల్వే వర్గాలు గురువారం తెలిపాయి. అగ్నివీరులకు వయస్సు, ఫిట్నెస్ పరీక్షలో సడలింపు ఉంటుంది.