CVC Report: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఆ తర్వాత రైల్వే, బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయి. 2022లో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలోని అన్ని కేటగిరీల అధికారులు, ఉద్యోగుల నుంచి మొత్తం 1,15,203 ఫిర్యాదులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. వీటిలో 85,437 పరిష్కారం కాగా 29,766 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
Read Also: Shocking Incident: షాకింగ్ ఘటన.. ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపిన యాత్రికుడు
కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఫిర్యాదులను విచారించడానికి బాడీకి రిమోట్ ఆర్మ్‌గా వ్యవహరించే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లకు మూడు నెలల కాలపరిమితిని నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం గత సంవత్సరం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా, రైల్వే 10,580, బ్యాంకులకు 8,129 ఫిర్యాదులు అందాయి. హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 23,919 పరిష్కరించబడ్డాయి. 22,724 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 19,198 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ఇటీవలే బహిరంగపరచబడింది. రైల్వే శాఖ 9,663 ఫిర్యాదులను పరిష్కరించిందని, 917 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 9 ఫిర్యాదులు 3 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
అవినీతికి సంబంధించిన 7,762 ఫిర్యాదులను బ్యాంకులు పరిష్కరించగా, 367 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 78 ఫిర్యాదులు 3 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. వీటిలో 6,804 పరిష్కారానికి నోచుకోగా, 566 పెండింగ్‌లో ఉన్నాయి. 18 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ శాఖల నుంచి కూడా..
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా), ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 4,710 ఫిర్యాదులు అందాయని నివేదిక పేర్కొంది. వీటిలో 3,889 పరిష్కారానికి నోచుకోగా, 821 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా 577 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.
Read Also: Viral Video: విమానంలో నెమలితో కనిపించిన అమ్మాయి.. ఎలా తీసుకొచ్చిందంటూ సందేహాలు
బొగ్గు మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 4,304 ఫిర్యాదులు రాగా, వాటిలో 4,050 పరిష్కారమయ్యాయని సీవీసీ వార్షిక నివేదిక పేర్కొంది. కార్మిక మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా 4,236 ఫిర్యాదులు రాగా, వాటిలో 4,016 పరిష్కరించబడ్డాయి. అదనంగా, పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై 2,617 ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో 2,409 పరిష్కరించబడ్డాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఉద్యోగులపై 2,150, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 1,619, టెలికాం శాఖ ఉద్యోగులపై 1,308, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 1,202, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC) ఉద్యోగులపై 1,202 ఫిర్యాదులు అందాయి. బీమా కంపెనీల్లో పనిచేస్తున్న వారిపై 987, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 970, ఉక్కు మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 923 ఫిర్యాదులు అందాయని సీవీసీ నివేదిక పేర్కొంది.