వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే…
ఉత్తరాంధ్రకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింఙారావు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు.
Andhra Pradesh: విశాఖ రైల్వేజోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది.…
Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం జరిగిందంటూ వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రధాని విశాఖకు వస్తారని అంటున్నారు.. ఆ రోజున విశాఖ రైల్వై జోన్.. ప్రత్యేక హోదాల మీద ప్రధాని ప్రకటనలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని హామీ ఇవ్వాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.…
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఎం నేతలు. కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ నేతలు నిరసన తెలిపారు. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం చెందారు. విశాఖ సీపీఐ కార్యాలయం నుంచి…