ఏపీలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. శ్రీకాకుళంలో తెలుగు శక్తి ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ రామ్మోహన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు మంత్రులు, సీఎం ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుండి వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తీసుకు వచ్చారా లేదా సమాధానం చెప్పాలన్నారు. రైల్వేజోన్ గురించి ఎవరూ మాట్లాడరు. రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు బాగుపడతాయన్నారు.
Genelia : ‘వేద్’ తో జెనీలియా రీఎంట్రీ… రితీష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం
ప్రైవేటీకరణ గురించి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కన్నీరు కారుస్తున్నారు…స్టీల్ ప్లాంట్ మన ఉత్తరాంధ్రలో ఉంది… దీనిపై ఎందుకు సిఎం మాట్లాడడంలేదన్నారు. రాజకీయం కోసం రాష్ట్రాన్ని ఇంకా విడగొట్టడానికి రాజధా పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. వాళ్లు ఎన్ని మాట్లాడినా ఎంత రెచ్చగొట్టినా మేము డైవర్టు అవ్వం. విశాఖపట్నంలో భూ కబ్జా ఎక్కువైంది… అది మీ నాయకులే చేస్తున్నారన్నారు ఎంపీ రామ్మోహననాయుడు. బుషికొండను ప్రైవేటు పరం చేసి గుండు కొట్టించారు… దానిపై మాట్లాడితే సమాధానం చెప్పరు. జగనన్న భూ హక్కు అంటున్నారు.. జగనన్న భూములు పంచుతున్నారా? రాష్ట్రంలో భూమి కనపడితే చాలు దానిని కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు రామ్మోహననాయుడు.
Allari Naresh: వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.. నేను దానికి పనికిరాను