Viral Video: ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్
- లోకో పైలట్ తన తెలివి తేటలు
- ట్రాక్‌పై అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు
- ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా గుర్తించిన పైలట్
- వెంటనే బ్రేక్ వేసి వాటిని రక్షించిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ విజ్ఞత చూపకపోతే చాలా ఏనుగులు చనిపోయి రైలు కూడా ఢీకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగులన్నీ మెల్లగా రైల్వే ట్రాక్ దాటుతున్న దృష్యాన్ని వీడియోలో చూడొచ్చు.
READ MORE: Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
ఏనుగులు వెళ్లిపోయిన తర్వాత, కొంతమంది ముందుకెళ్లి ఏనుగులన్నీ వెళ్లాయా లేదా అని తనిఖీ చేశారు. అప్పుడు రైలు బయలుదేరుతుంది. చాలా ఏనుగులు ట్రాక్‌పై ప్రయాణిస్తున్నాయని లోకో పైలట్ అధికారులకు చెప్పారు. చిమ్మ చీకటిలో వేగంగా వెళ్తున్న రైలులో నుంచి లోకో పైలట్లు ఏనుగులను గమనించడానికి కారణం ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ సేఫ్టీ సిస్టమ్ ముందుగా అలెర్ట్ ఇవ్వడంతో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించారు. ఆ తర్వాత ఏనుగులను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. దీనికి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌లను ప్రశంసించారు. అంతేకాకుండా ఏఐ ఆధారిత సాంకేతికతను కూడా వినియోగదారులు ప్రశంసించారు.
Incredible sight ! A big shout-out to Loco Pilot Das and Assistant Loco Pilot Umesh Kumar of the 15959 Kamrup Express for their swift and heroic action on 16th October in saving a herd of about 60 elephants crossing the railway tracks between Habaipur and Lamsakhang by applying… pic.twitter.com/otfQ3nwjDJ
— Supriya Sahu IAS (@supriyasahuias) October 18, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!