ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం…
రోజు రోజుకు హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ ఉత్త మాటలుగా మారింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిజ్జా ప్రియులకు కొదువ లేదు. కానీ తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో పిజ్జా హౌస్‌లను షాక్ చేశారు.
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ షాపులు, ఆర్ఎంపి క్లినికులపై తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా రావిరాలలో శ్రీ బాలాజీ క్లినిక్ లో తనిఖీలు చేశారు. గుండ్లపల్లి నరసింహ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్టెరైడ్స్ తో పాటు 37రకాల ఇతర మెడిసిన్ సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గ్రామంలో మహమ్మద్ మసూద్ అనే వ్యక్తి ఆర్ఎంపి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. Also Read:Nambala Kesava Rao:…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్‌సి హరిరామ్ ఏసీబి కస్టడి కొనసాగుతోంది. ఇప్పటికే హరిరామ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈఎన్‌సీ హరిరామ్ ను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. శుక్రవారం హరిరామ్ ను చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబి కస్టడులోకి తీసుకుంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబి. బహిరంగ మార్కెట్ వీటి విలువ…
ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఇంటితో పాటు 14చోట్ల ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. గడిచిన 11 గంటలుగా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హరిరామ్ భార్య అనిత ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నీటిపారుదల శాఖలో అనిత డిప్యూటీ ENC గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరాం. NDSA రిపోర్ట్ ఆధారంగా ACB సోదాలు చేపట్టింది. రెండు రోజుల క్రితమే…
క్రికెట్ బెట్టింగ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బీహెచ్ఈఎల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఓ ముఠా. వాట్సప్ కాల్స్ ఆధారంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ బృందం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసింది. పఠాన్ చెరువుకు చెందిన చిరంజీవి, కృష్ణ ను రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకుంది. ఆర్గనైజర్ పరారీలో ఉన్నట్లు…
వీకెండ్ లో లేదా ఫెస్టివల్స్ సందర్భాల్లో ఫ్రెండ్స్ తో కలిసి.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హోటల్స్ లో డిన్నర్ చేసేందుకు వెళ్తుంటారు. ఇలా మీరు కూడా వెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని చేజేతులా చిక్కుల్లో పడేసుకున్నట్లే. ఇటీవల పలువురు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టుకున్న ఆహారపదార్థాలు పాడైపోవడం, బొద్దింకలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు మండి రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్స్ మీద మెరుపు దాడులు జరిగాయి. 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు. మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై ఈ దాడులు చేశారు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో మెరుపు దాడులు కొనసాగాయి..
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది.