ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఇంటితో పాటు 14చోట్ల ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. గడిచిన 11 గంటలుగా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హరిరామ్ భార్య అనిత ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నీటిపారుదల శాఖలో అనిత డిప్యూటీ ENC గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరాం. NDSA రిపోర్ట్ ఆధారంగా ACB సోదాలు చేపట్టింది. రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి NDSA నివేదిక ఇచ్చింది. నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది.
Also Read:V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..
కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సి హరీరాం భారీగా ఆస్తులు కూడ పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్ లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాదులో లగ్జరీ ప్లాట్లు గుర్తించింది ఏసీబీ.. గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గం మార్కూక్ లో 30 నుంచి 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఆధారాలపై మర్కుక్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.