తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని.. సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన చేశారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారుల బదిలీలు అయ్యాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది. రంగారెడ్డి, మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పలు పత్రాలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్తో పాటు డబ్బులు గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు
మరోవైపు.. హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో రవాణా శాఖ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. అటు.. టోలిచౌకీ ఆర్టీవో ఆఫీస్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేసింది. ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు.
ఆర్టీఏ ఆఫీసులలో, చెక్ పోస్టులలో ఏసీబీ డీకోయ్ (decoy) ఆపరేషన్ చేపట్టింది. నటులుగా మారిపోయి డ్రైవర్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏసీబీ అధికారులు క్యూ కట్టారు. లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకుని చెక్ పోస్టుల వద్ద తనిఖీలకు వెళ్లారు తెలంగాణ ఏసీబీ అధికారులు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు.