ఆ మంత్రికి సెబ్ సెగ గట్టిగానే తాకిందా? సెబ్ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ? సమీక్షా సమావేశంలో ‘సెబ్’ అధికారులపై మంత్రి ఫైర్‌మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాల్లో ఆయన చెప్పిందే వేదం.. శాసనం. అలాంటి మంత్రిని కూడా పట్టించుకోవడం లేదట ఓ ప్రభుత్వ విభాగం. అదే.. ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేసే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్…
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు చేయడం కలకలం రేపింది. అయితే, జిల్లా రిజిస్ట్రార్ పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను అధికారులు అనుమతించలేదు. వీడియోలు తీసేందుకు నిరాకరించారు అధికారులు. సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా ఓ రిపోర్టర్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని వీడియోలు తొలగించారు అధికారులు. శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహింనట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్…
విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిపై విస్తృతంగా దాడులు నిర్వహించి, వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసులతో పాటు బైండోవర్ కేసులు నమోదుకు చర్యలు తీసుకిన్నారు. దీనిలో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటికే పట్టుకున్న 89 మంది నిందితులను గురువారం రోలుగుంట తహశీల్దారు శ్రీనివాసరావు ఎదుట హాజరు పరిచి వారిపై బైండోవర్…
హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటి దాడులులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రెండు రోజులుగా ఐటి అధికారులు చేస్తున్న దాడి లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి . టాక్స్ చెల్లింపులో వ్యత్యాసంతో పాటుగా పెద్ద ఎత్తున తప్పుడు ఇన్వాయిస్ లు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో కంపెనీ అకౌంట్స్ నుంచి నగదు విత్ డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. కంపెనీ నుంచి విత్ డ్రా చేసిన నగదు ఎక్కడికి వెళ్తుందనే దానిపై…
తెలంగాణలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సీడ్ & ఫెర్టిలైజర్ దుకాణాలపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు దుకాణాలలో తనిఖీలు చేపట్టగా.. సుమారు 8 లక్షల విలువైన అనుమతుల్లేని పత్తి విత్తనాలను పట్టుకున్నారు.…