హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.…
మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనిపై ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఖండించారు. మంగళవారం ఏకే గోయల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేపడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతపై దాడులు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్‌లు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.