BJP: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబ్ పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.
BJP: ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశ ప్లేయర్లకు ‘‘హ్యాండ్ షేక్’’ కూడా మన ప్లేయర్లు ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని ‘‘పహల్గామ్’’ బాధితులకు, భారత సైన్యానికి అంకితమిచ్చారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా రగిలిపోతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు భారత్‌పై విమర్శలు…
Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇది…
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘‘ఓటు చోరి’’ కొనసాగితే భారతదేశంలో కూడా నేపాల్ లాంటి పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్ రాజకీయాలను ప్రస్తావించారు. "ఇలాంటి ఓట్ల దొంగతనం జరుగుతూనే ఉంటే, పొరుగు దేశాలలో వీధుల్లో కనిపించే వ్యక్తుల మాదిరిగానే, ఇక్కడ కూడా ఇది కనిపించవచ్చు" అని అన్నారు.
ప్రధాని తల్లి గురించి కాంగ్రెస్ ఏఐ వీడియో చేయడం సిగ్గుచేటని గోవా ఆరోగ్య మంత్రి రాణే అన్నారు. విశ్వజిత్ రాణే, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ రాణే కుమారుడు. ప్రతాప్ సింగ్ గోవాకు ఏడు సార్లు సీఎంగా పనిచేశారు. 50 ఏళ్లు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. 2017లో విశ్వజిత్ రాణే బీజేపీలో చేరారు. ప్రస్తుతం, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు.
గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఒక దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘నికోబార్‌లో పర్యావరణ విపత్తును సృష్టించడం’’ అనే శీర్షికతో ది హిందూలో ప్రచురితమైన ఒక కథనాన్ని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.