కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భారీగా విషెస్ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు.
ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.
Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajnath Singh: భారతదేశంలోని 10 శాతం మంది సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, అగ్రకులాలే సైన్యాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Election Commission: హర్యానాలో ఓట్ల దొంగతనం జరిగినట్లు రాహుల్ గాంధీ బుధవారం భారత ఎన్నికల కమిషన్(ECI) తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. కాంగ్రెస్ నేత ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) కు మద్దతు ఇస్తున్నారా.? లేక వ్యతిరేకిస్తున్నారా.? అని ప్రశ్నించింది. సర్ ద్వారా ఈసీ నకిలీ, చనిపోయిన, వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను తొలగిస్తుంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.…