బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్లచోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ.. రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరక్షన్ తర్వాత.. బీహార్ ఎన్నికలు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్‌లో చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్‌లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు.
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సర్ధార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం హుస్నాబాద్‌లోని పాపన్న కోటను లీజుకు ఇచ్చిందని, తాము అయితే ఆ కోటను సంరక్షించడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ను పోటీ చేయించడం కూడా అదే భావనలోనుంచే జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ గాంధీ…
దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.