ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
Amit Shah: ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థను ఆక్రమిస్తోందని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించిన ఒక రోజు తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఈ రోజు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని,
Amit Shah: పార్లమెంట్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై వాడీవేడీ చర్చ జరిగింది. అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య తీవ్రమైన చర్చ నడిచింది. ఓట్ చోరీ, ఈవీఎంలపై రాహుల్ గాంధీ ఆరోపించగా, అందుకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
Amit Shah: పార్లమెంట్ ‘‘ఓట్ చోరీ’’ అంశంపై దద్దరిల్లింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఓట్ చోరీపై తనతో సభలో చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై చర్చించేందు అమిత్ షా భయపడుతున్నారని అన్నారు. హర్యానాలో 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే, దీనికి ప్రతిగా నా ప్రసంగంలో నేను ఎప్పుడు ఏది…
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది.
ప్రధాని మోడీ-ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార కమిషన్‌లో ఖాళీగా ఉన్ని ఎనిమిది పోస్టుల భర్తీ కోసం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇద్దరి సమావేశంలో ఎనిమిది స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు.
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది.
Putin dinner: విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలను కలవకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదని పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు వచ్చిన ఒక రోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది.