లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ న్యూఇయర్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేశారు. రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ వేడుకలు జరుపుకోనున్నారు.
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
స్టీలు ప్లాంటు మీద ప్రధాని మోడీ కన్ను పడిందని మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్టీలు ప్లాంటును ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఏపీ కాంగ్రెస్ లో రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు.
Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. వైశ్య వర్గానికి చెందిన వ్యాపారులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు.
తన భార్య ప్రియాంకాగాంధీ ఏదొక రోజు భారతదేశ ప్రధాని అవుతుందని భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. ప్రియాంకాగాంధీ తన నాయనమ్మ లాగానే బలమైన ప్రధానమంత్రి అని నిరూపించుకుంటారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించేందుకే రాహుల్‌గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు.
మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి జయకేతనం ఎగురవేసింది.
Rahul Gandhi: జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదానికి కారణమయ్యారు. భారతదేశాన్ని అస్థిరపరచాలని భావించే జార్జ్ సోరోస్ సన్నిహితురాలు ప్రొఫఎసర్ డాక్టర్ కార్నెలియా వోల్‌ను కలిశారు. సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీలను ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్ నేతపై తీవ్ర విమర్శలు చేస్తోంది.