ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీ్ట్ చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆప్ సైతం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. 28 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. డిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని బండి సంజయ్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన డిల్లీ ప్రజలు కోరుకున్నారని అన్నారు. అవినీతి,కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారన్నారు. డిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని చెప్పారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025