Komatireddy Venkat Reddy: కేటీఆర్ వాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి..
- రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- మేము కాంగ్రెస్ పార్టీ యోధులం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- తెలంగాణలో ఓటమి తర్వాత ఎలాగైతే తిరిగి పుంజుకొని విజయం సాధించామో..
- అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం..
- మీ స్వంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం, పార్టీ మీది- కోమటిరెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మేము కాంగ్రెస్ పార్టీ యోధులం.. తెలంగాణలో ఓటమి తర్వాత ఎలాగైతే తిరిగి పుంజుకొని విజయం సాధించామో.. అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం.. మీ స్వంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం, పార్టీ మీది. తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు అందించిన మీకు అభినందనలు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ ఘనతనే’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Dear @KTRBRS,
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
We, the Congress Party, are fighters—we never give up, and we always bounce back, just like we did in Telangana.
We would have congratulated you on your spectacular achievement in the Parliament elections—delivering zero seats for your own party and gifting 8…
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 8, 2025
అంతకుముందు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీ్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలిందని సెటైర్లు వేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయం చెందడంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం అని హరీష్ రావు చలోక్తులు విసిరారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని పేర్కొన్నారు.
Read Also: Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!