Rahul Gandhi: ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే.. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి..
- మోడ్రన్ సోషల్ మీడియాతో అంతా మారిపోయింది..
- ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే నడుస్తుంది..
- ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి..
- విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండే.. కానీ, కాశ్మీర్ కి వెళ్లాను.. క్షమించండి.. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇక, రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలి.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయి.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అని ఆయన తెలిపారు. ఇక, భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచా.. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Read Also: Chiru Anil: అబ్బే.. ఆ వార్తలు అన్నీ ఫేకేనట?
Also Read
కానీ, ఈ పాదయాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పట్నుంచి అందరూ స్పందిస్తున్నారని తెలిపారు. యాత్రలో కొన్ని సార్లు స్టక్ అయ్యాను.. అప్పటి నుంచి నన్ను చాలా మంది ఇష్టపడటం మొదలు పెట్టారు.. ఓ చిన్న అమ్మాయి వచ్చి లవ్ యూ అని చెప్పింది.. ఆ తర్వాత నేను కూడా నా ఇష్టాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ వచ్చాను అన్నారు. హిందీలో ఓ స్లోగన్ తీసుకున్నాం.. విద్వేషం అనే బజార్ లో ప్రేమ అనే దుకాణం తెరిచా (నఫ్రత్ కే బజార్ మే.. మే.. మహబత్ కే దుకాన్) అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?