రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా..…
పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్,…
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అంతర్గత విభేధాలు భగ్గుమన్నాయి. అమరిందర్ సింగ్ ను అధికారపార్టీకి చెందిన కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ ముఖ్యమంత్రిని ప్రముఖంగా విమర్శంచే వారిలో ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అమరిందర్ సింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్థూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. Read: నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో…
విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి…
నిన్న (శనివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొద్ది గంటల అనంతరం వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై ఎద్దేవా చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రం మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ కోసం తాపత్రయ పడుతోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు వ్యాక్సిన్ల కొరతపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ప్రధాని మోడీ గానీ, కేంద్రం గానీ కరోనా సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని మండిపడ్డారు.. కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని.. విస్తరిస్తోన్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుందన్నారు రాహుల్.. మరోవైపు వ్యాక్సినేషన్‌పై మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించి…
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కారును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని వివిధ దేశాలు హెచ్చరిస్తున్న తరుణంలో మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్ అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు…
నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కరోనా నివారణ చర్యల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడంపై ట్విట్టర్లో స్పందించిన రాహుల్.. ఆ పోస్టర్ల కాపీలను షేర్ చేస్తూ. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.. ఇక, మోడీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?…