ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్హయ్య కుమార్‌కు…
బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను కంచుకోటగా మార్చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ పై తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక త్వరలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.…
ఇతర పార్టీలన్నీ జనాల్లో దూసుకుపోతుంటే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రోజు రోజుకూ డీలా పడిపోతున్నారు. సోనియాగాంధీకి వయోభారం.. ఆమె స్థాయిలో పార్టీని రాహుల్ నడిపించడానికి ముందుకు రాకపోతుండడం.. ఇతర సీనియర్లు సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపని వైనం.. ఈ కారణాలతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ కు బలమైన ప్రజామద్దతు ఇప్పటికీ ఉంది. బీసీలు, మైనారిటీలు చాలా ప్రాంతాల్లో నేటికీ ఆ పార్టీని…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో…
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్‌తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు.…
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్ వాచ్! రాహుల్‌తో వన్ టు వన్ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు! తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్ సమావేశమైంది. సీనియర్ నాయకులతో…
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం మహాసంద్రంలో నావలా తయారైంది. మోదీ హవాను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారానికి దూరమైంది. ఈ ప్రభావం రాష్ట్రాలపై పడటంతో కాంగ్రెస్ క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు ఉన్న సోనియాగాంధీకి వయస్సు పైబడటం, అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతను తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించే ప్రయత్నం చేశారు. ఒకసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ గత…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు…
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అధికంగా కనిపించేవారు. ఇప్పుడు సీనియర్లతో పాటుగా దూకుడు కలిగిన యువనేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నారు. సీనియర్లు యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ నిండుదనంగా కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేసిన తరువాత కాస్తంత దూకుడును ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి మొదట్లో వర్కింగ్ ప్రెసిడెండ్‌గా బాధ్యతలు అప్పగించగా, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో, రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. తెలంగాణ…